Guppedantha Manasu: జగతి ఎక్కడా అంటూ.. మహేంద్ర కాలర్ పట్టుకొని అడిగిన అనుపమ..?

కన్నీళ్లు ఆపుకోవడానికి కూడా కారణాలు వెతుక్కుంటున్నావ్

Update: 2023-10-27 06:37 GMT

దిశ,వెబ్ డెస్క్: 'అను ప్లీజ్.. మాటి మాటికి జగతి గురించి మాట్లాడకు అంటూ.. వెంటనే జగతి తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు మహేంద్ర. చిన్నగా తుడుచుకుంటూ ఉంటే అది గమనించిన అనుపమ.. ఏంటి ‘నీకు కన్నీళ్లు కూడా వస్తాయా?’అని మహేంద్రను అడుగుతుంది. ‘హే.. నేనేం ఏడవడం లేదు.. కంట్లో ఏదో నలక పడింది..’అని మహేంద్ర అంటాడు. ‘సరే కానీవ్వు.. కన్నీళ్లు ఆపుకోవడానికి కూడా కారణాలు వెతుక్కుంటున్నావ్..’ అని అనుపమ అంటుంది. ఏమి చేద్దాం.. తప్పట్లేదు జగతీ.. అని మహేంద్ర అంటాడు. ‘ఏమని పిలిచావ్?’ అని అనుపమ అడుగుతుంది.

‘హా.. అను.. సారీ అను.. అను ఒక్క విషయం చెప్పు.. నీ పిల్లలు మీ వారు.. నీ పర్సనల్ విషయాలు చెప్పు..అని టాపిక్ డైవర్ట్ చేస్తాడు. ‘నువ్వు జగతి కలిసి అడిగితే కచ్చితంగా సమాధానం చెబుతాను..’ అంటుంది అనుపమ. నేను అడిగితే నువ్వు సమాధానం చెప్పవు.. అంతే కదా .. అని మహేంద్ర అంటాడు. మళ్లీ జగతి గురించి ఎత్తుతుంది.. మహేంద్ర ఎంతకూ నోరు మెదపకపోయే సరికి అనుపమ, మహేంద్ర కాలర్ పట్టుకుని అడుగుతుంది. 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News