సూపర్ స్టార్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. కల్కిలో మహేష్ బాబు

ఇటీవలే ‘సలార్’ తో భారీ హిట్ అందుకున్న మన రెబల్ స్టార్ ప్రభాస్ అందరికీ సుపరిచితమే. దాదాపు ఆరేళ్ళ తర్వాత ప్రభాస్ నుంచి ఇలాంటి హిట్ వచ్చింది.

Update: 2024-05-08 09:17 GMT

దిశ, సినిమా: ఇటీవలే ‘సలార్’ తో భారీ హిట్ అందుకున్న మన రెబల్ స్టార్ ప్రభాస్ అందరికీ సుపరిచితమే. దాదాపు ఆరేళ్ళ తర్వాత ప్రభాస్ నుంచి ఇలాంటి హిట్ వచ్చింది. ఇక ఇప్పుడు ప్రేక్షకులంతా సలార్ పార్ట్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD. ఇండియన్ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వస్తున్న ఈ ప్రెస్టీజియస్ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు.

ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూడా ఈ మూవీలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె, దిశా పటాని హీరోయిన్స్ కూడా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. అయితే తాజాగా ఓ వార్త హల్‌చల్ చేస్తుంది.

ఈ మూవీలో ప్రభాస్.. శ్రీమహావిష్ణు దశావతారం అయిన కల్కిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ ని విష్ణు అవతారంలో పరిచయం చేయడం కోసం మహేష్ బాబుతో వాయిస్ ఓవర్ చెప్పించాలని ప్రయత్నిస్తున్నారట. ఇందుకోసం ఆల్రెడీ నాగ్ అశ్విన్ అండ్ టీం.. మహేష్ బాబుని సంప్రదించినట్లు సమాచారం. తెలుగులో మహేష్ తో చెప్పించినట్లు.. ఇతర భాషల్లో అక్కడి స్టార్ హీరోలతో చెప్పించే ప్రయత్నం కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది.

ఈ వార్తతో ఆడియన్స్ లో మూవీ పై మరింత క్రేజ్ క్రియేట్ అవుతుంది. అలాగే మరికొంత సర్‌ప్రైజింగ్ స్టార్ కాస్ట్ కూడా మూవీలో కనిపించబోతుందట. ఆ సర్‌ప్రైజ్ లు తెలియాలంటే.. జూన్ 27 వరకు ఎదురు చూడాల్సిందే. కాగా ఈ మూవీని సి అశ్వినీదత్ దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Read More...

ప్రభాస్‌కి ఆ హీరోయిన్‌తో ఉన్న సీక్రెట్ ఎఫైర్‌ని బయటపెట్టిన అల్లు అర్జున్..! 

Similar News