రాయలసీమలోనే 'గాడ్‌ఫాదర్' ప్రీ రిలీజ్ ఈవెంట్..
దిశ,సినిమా: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మోహన్ రాజా దర్శకత్యంలో తెరకెక్కుతున్న మూవీ ‘గాడ్ ఫాదర్’.
దిశ,సినిమా: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మోహన్ రాజా దర్శకత్యంలో తెరకెక్కుతున్న మూవీ 'గాడ్ ఫాదర్'. ఈ సినిమా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. రిసెంట్‌గా సెన్సార్ పనులు పూర్తిచెసుకోని 'యు/ఎ' సర్టిఫికేట్ కూడా సొంతం చెసుకుంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన చిరు పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏపి అనంతపురంలోని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో సెప్టెంబర్ 28న జరగనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నయనతార కూడా స్పెషల్ ఎట్రాక్షన్ కానుందని సమాచారం.