భారత్ అభివృద్ధి సరిహద్దులు దాటుతోంది ఇది వినడానికి సంతోషంగా ఉంది.. రాజమౌళి ఆసక్తికర పోస్ట్

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతో ssmb అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ పనుల్లో ఫుల్ బిజీ అయిపోయాడు.

Update: 2024-05-24 13:13 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతో ssmb అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ పనుల్లో ఫుల్ బిజీ అయిపోయాడు. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు విషయాలపై స్పందిస్తున్నాడు. తాజాగా, రాజమౌళి ఓ షార్ట్ ఫిల్మ్‌ ఉత్తమ షాట్ ఫిల్మ్‌గా కేన్స్‌‌లో ఎంపికవడంపై ప్రశంసలు కురిపిస్తూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ షేర్ చేశాడు. 2024 ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమంలో ‘సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ ఒన్స్ టు నో’ బెస్ట్ ఫిల్మ్‌గా సెలెక్ట్ అయింది.

ఏకంగా 17 చిత్రాలతో పోటీ పడి మొదటి స్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే దీనిపై రాజమౌళి.. ‘‘భారత ప్రతిభ సరిహద్దులు దాటుతోంది. అది వినడానికి సంతోషంగా ఉంది. చిదానందస్నాయక్ ‘సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ ఒన్స్ టు నో’ కేన్స్ 2024లో ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌గా లా సినీఫ్ అవార్డును గెలుచుకుంది! యువకులకు వందనాలు’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం రాజమౌళి పోస్ట్ వైరల్ కావడంతో అది చూసిన వారంతా ఆ ఫార్ట్ ఫిల్మ్ మేకర్స్‌కు అభినందనలు తెలుపుతున్నారు.

Similar News