త్రిషను మరిపించిన సితార డాన్స్.. వీడియో వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి చిన్నారి సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి చిన్నారి సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మూవీస్లో ఎంట్రీ ఇవ్వనప్పటికీ సోషల్ మీడియాలో ఈ పాపకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సితార సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో ఆమెకు సంబంధించిన పలు విషయాలు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. రీసెంట్గా మహేష్ బాబు 'అతడు' మూవీ నుంచి ''పిల్ల గాలి అల్లరి'' పాటకు తను డ్యాన్స్ చేసిన వీడియోను పంచుకుంది. ఇది చూసి మహేష్ అభిమానులు ఎంతో సంతోషించారు. హీరోయిన్ త్రిషకు మించిన డ్యాన్స్ పర్ఫామెన్స్ అంటూ మెచ్చుకుంటున్నారు.