ఐదుగురు భార్యలతో ఫస్ట్ నైట్ .. ఓటీటీలోకి వచ్చేస్తున్న వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

మలయాళం నుంచి ఏ మూవీ వచ్చినా బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయి.

Update: 2024-05-25 05:42 GMT

దిశ, సినిమా : ఈ మధ్య కాలంలో మలయాళం నుంచి ఏ మూవీ వచ్చినా బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయి. పెద్ద, చిన్న తేడా లేకుండా రిలీజ్ అయినా సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి. భ్రమయుగం మూవీ నుంచి ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ చిత్రాల వరకు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

రిలీజ్ అయినా తక్కువ సమయంలోనే కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు మరో మలయాళీ వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యింది. కానీ ఈసారి మన ముందుకు రాబోయేది కామెడీ ఎంటర్టైనర్. ఈ సీరిస్ టైటిల్ నాగేంద్రన్స్ హానీమూన్స్. టైటిల్ కు తగ్గట్లే ఈ సిరీస్ కూడా అలాగే ఉంటుంది. ఇందులో నేషనల్ అవార్డ్ విన్నర్ సూరజ్ వెంజరమూడు, గ్రేస్ ఆంటోని, కనికుశ్రుతి, శ్వేత మీనన్, ఆల్ఫీ పంజికరన్, నిరంజన అనూప్ ముఖ్య పాత్రలు పోషించారు.

ఐదుగురు భార్యలున్న భర్త పాత్రలో సూరజ్ అద్భుతంగ నటించాడు. భార్యలతో భర్త హనీమూన్ ప్లాన్ చేయడానికి గల కారణం ఏంటి ? అతను ఐదుగురిని ఎందుకు వివాహం చేసుకున్నాడో తెలుసుకోవాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.. ఈ సిరీస్ ప్రముఖ OTT ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ప్రసారం కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సిరీస్‌ను ప్రసారం చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సిరీస్‌ని జూన్ మొదటి వారంలో విడుదల చేయనున్నారు. 

Similar News