షూటింగ్ స్పాట్లో అగ్ని ప్రమాదం.. నటి పరిస్థితి విషమం..?
బంగ్లాదేశీ నటి షర్మీన్ అకీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘సిన్సియర్లీ యువర్స్, ఢాఖా, బైషే శ్రబాన్ తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె..
దిశ, వెబ్డెస్క్: బంగ్లాదేశీ నటి షర్మీన్ అకీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'సిన్సియర్లీ యువర్స్, ఢాఖా, బైషే శ్రబాన్ తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ప్రస్తుతం మరో చిత్రం షూటింగ్లో బిజీగా ఉంది. ఈ క్రమంలో షూటింగ్ మధ్యలో ఆమె మేకప్ రూమ్లో ఉండగా పేలుడు సంభవించింది. దీంతో సెట్లో మొత్తం మంటలు చెలరేగాయి.
నటి షర్మీన్ ఆ మంటల్లో చిక్కుకొగా.. ఆమె చేతులు, కాళ్లు, శరీరంలో కొన్ని భాగాలకు గాయాలయ్యాయి. దీంతో ఆమెను హుటాహుటినా షేక్ హసీనా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బర్న్స్ అంట్ ప్లాస్టిక్ సర్జరీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె శరీరం 35 శాతం కాలిపోయినట్లు చెప్పారు. అంతే కాకుండా ఆమె బాడీ చికిత్సకు స్పందించడం లేదని.. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.