బుజ్జి ఈవెంట్ కోసం ప్రభాస్ అన్ని రోజులు కష్టపడ్డాడా? ఆయన కమిట్మెంట్‌కు ఫిదా కావాల్సిందే

ప్రభాస్ ' Kalki 2898 AD ' టాక్ ఆఫ్ ది వరల్డ్ అయిపోయింది. టాలీవుడ్ నుంచి వస్తున్న సినిమా ఇంటర్నేషనల్ రీచ్ అందుకుంటుంది. ప్రమోషన్స్ కూడా అదే లెవల్ లో ప్లాన్ చేస్తున్నాడు

Update: 2024-05-24 05:11 GMT

దిశ, సినిమా: ప్రభాస్ ' Kalki 2898 AD ' టాక్ ఆఫ్ ది వరల్డ్ అయిపోయింది. టాలీవుడ్ నుంచి వస్తున్న సినిమా ఇంటర్నేషనల్ రీచ్ అందుకుంటుంది. ప్రమోషన్స్ కూడా అదే లెవల్ లో ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ క్రమంలోనే త్వరలో నా లైఫ్ లోకి స్పెషల్ పర్సన్ రాబోతుంది అంటూ ప్రభాస్ తో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టించిన ఆయన.. ఆ తర్వాత బుజ్జిని ఇంట్రడ్యూస్ చేశాడు. స్క్రాచ్ 4 అంటూ ముందుగా బుజ్జి బ్రెయిన్ ను క్లిప్పింగ్ ద్వారా పరిచయం చేయించి.. తర్వాత స్వయంగా ఈ కారును ప్రభాస్ ద్వారా లైవ్ లో అభిమానుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేశాడు. హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు.

అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ ఈవెంట్ కు పెద్ద ఎత్తున అభిమాన జనం తరలిరాగా.. వారి కోసం ప్రభాస్ ఎంతగా కష్టపడ్డాడో వివరించారు మేకర్స్. స్పెషల్లీ డిజైన్డ్ కారుతో బయట స్టంట్ చేయడం ఓకే కానీ బారికేడ్లు నిర్మించిన గ్రౌండ్ లో చేయడం కష్టమే. కొంచెం అటు ఇటు అయినా ప్రమాదం జరగవచ్చు. అందుకే ఇలాంటి రిస్క్ లేకుండా ఉండేందుకు మూడు రోజులు ప్రాక్టీస్ చేశాడట డార్లింగ్. రోజుకు ఐదు గంటల చొప్పున ఇందుకోసం కష్టపడ్డాడని తెలిపారు. దీంతో రెబల్ స్టార్ సినిమాకు, తమను ఇస్తున్న రెస్పెక్ట్ చూసి మురిసిపోతున్నారు ఫ్యాన్స్. కాగా వైజయంతీ మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పఠానీ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నాడు.

Similar News