jhanvi Kapoor: కంగారులో తారక్‌ను అలా పిలిచిన జాన్వీ

నందమూరి అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న సినిమా ‘#NTR 30’

Update: 2023-03-29 06:39 GMT

దిశ, సినిమా: నందమూరి అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న సినిమా ‘#NTR 30’. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు రీసెంట్‌గానే జరిగాయి. కాగా ఈ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది జాన్వీ కపూర్. అయితే ఇన్నాళ్లు బాలీవుడ్‌లో చిట్టి పొట్టి బట్టలతో అలరించిన జాన్వీ.. తెలుగు సినిమాలో మాత్రం ట్రెడిషనల్ లుక్‌లో కనిపించబోతుంది. అయితే ఈ పూజా కార్యక్రమంలో తారక్‌ను మొట్ట మొదటి సారి కలిసిన నటి.. ఏమని పిలవాలో అర్థం కాక కంగారులో సార్ అని పిలిచింది. కానీ హీరోమాత్రం తారక్ అని పిలువమని ఎన్నిసార్లు చెప్పినా అలా పిలవలేక పోయిందంట. ‘నందమూరి ఫ్యామిలీ గొప్పతనం గురించి మా అమ్మ చాలాసార్లు చెప్పింది. మీ పక్కన నటించడం నా అదృష్టంగా భావిస్తున్నా. మిమ్మల్ని పేరు పెట్టి పిలవడం నో వే’ అంటూ సరదాగా చెప్పుకొచ్చింది. 

ఇవి కూడా చదవండి: ‘దసరా’లో సిల్క్ స్మిత పోస్టర్ పెట్టడానికి అదే కారణమట!

Tags:    

Similar News