పాన్ ఇండియా స్టార్ Allu Arjun తొలి సంపాదన ఎంతో తెలుసా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప ది రైజ్’ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Update: 2023-08-25 08:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప ది రైజ్’ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఉత్తమ నటుడు అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. దీంతో.. నెట్టింట అల్లు అర్జున్‌పై ప్రశంసలు జల్లు వెల్లువెత్తాయి. దాంతో పాటు బన్నీ పాత విషయాలు కూడా తెర మీదకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తొలి సంపాదన గురించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. 21 ఏళ్లకే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ‘గంగ్రోతి’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. అయితే.. హీరోగా అరంగేట్రం చేయకముందు యానిమేటర్, డిజైనర్‌గా కెరీర్ మొదలు పెట్టారట. అప్పుడు ఆయన జీతం రూ, 3,500 మాత్రమే. కేవలం రూ. 3,500తో తన కెరీర్ స్టార్ట్ చేసిన బన్ని ఈ రోజు ఐకాన్ స్టార్‌గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇవి కూడా చదవండి :

అల్లు అర్జున్ డాన్స్ చూసి చేతిలో వంద రూపాయలు పెట్టిన స్టార్ డైరెక్టర్..

సీనియర్ నటి కన్నుమూత.. 

Tags:    

Similar News