బాలీవుడ్ రామాయణంలో సీత పాత్ర మిస్ చేసుకున్న బ్యూటీ ఎవరో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో ఇటీవల రామాయణం కాన్సెప్ట్‌తో వస్తున్నసినిమాల సంఖ్య ఎక్కువే. బడా డైరెక్టర్స్ అందరూ కూడా రామాయణాన్ని తమదైన స్టైల్‌లో చూపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

Update: 2024-04-28 11:13 GMT

దిశ,వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో ఇటీవల రామాయణం కాన్సెప్ట్‌తో వస్తున్నసినిమాల సంఖ్య ఎక్కువే. బడా డైరెక్టర్స్ అందరూ కూడా రామాయణాన్ని తమదైన స్టైల్‌లో చూపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే టాలీవుడ్‌లో ఎన్నో మూవీస్ రామాయణం కాన్సెప్ట్ తో తెరకెక్కి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రజెంట్ బాలీవుడ్‌లో కూడా రామాయణం కాన్సెప్ట్‌తో మూవీ రాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.

అది ఏంటంటే..ఈ మూవీలో సీతాదేవి పాత్ర కోసం చాలా మంది హీరోయిన్స్ ని సెలెక్ట్ చేశారంట. కానీ పలు కారణాల చేత ఆ మూవీకి రిజెక్ట్ చేశారంట. ఈ క్రమంలో సీత పాత్ర రిజెక్ట్ చేసిన అన్ లక్కీ హీరోయిన్‌ల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొదట ఈ మూవీలో సీతాదేవి పాత్ర కోసం కృతి సనన్‌ని అనుకున్నారట. కృతి సనన్ ఆల్రెడీ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలో సీతాదేవి పాత్రలో కనిపించింది. మరోసారి అదే పాత్రలో కనిపిస్తే జనాలకు ఇంట్రెస్ట్ ఉండదని రిజెక్ట్ చేసిందట.

ఇక నయనతార రణ్‌బీర్ పక్కన సూట్ అవ్వను అనే రిజన్‌తో రిజెక్ట్ చేసిందట. ఫైనల్‌గా ఆ పాత్ర కోసం సాయి పల్లవి సెలెక్ట్ అయిందని సమాచారం. ఈ మూవీలో హీరో రణ్‌బీర్ కపూర్ తో సాయిపల్లవి జోడికట్టనుంది. రాముడి పాత్రలో రణ్ బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి అలరించబోతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలా మంది సీతాదేవి పాత్రలో సాయి పల్లవి అదిరిపోయింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Read More..

అక్కడ ఆ పూజలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన సంయుక్త మీనన్.. పెళ్లి చేసుకోబోతుందా?

Similar News