పవన్ కల్యాణ్-అన్నా లెజినోవా మధ్య అన్ని సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉందా? నెట్టింట వైరల్

తొందరలో ఎన్నికలు రాబోతుండటంతో.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రచారంలో ఫుల్ బిజీ అయిపోయారు.

Update: 2024-05-01 08:55 GMT

దిశ, సినిమా: తొందరలో ఎన్నికలు రాబోతుండటంతో.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రచారంలో ఫుల్ బిజీ అయిపోయారు. ఆరోగ్యం సహకరించకపోయినా సరే లెక్క చేయకుండా ప్రచారం చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తున్నాడు. ఇక ఎన్నికలు పూర్తి అయ్యే వరకు సినిమాలకు గ్యాప్ ఇచ్చి పూర్తిగా గెలిచే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ప్రచారాల్లో మెగా ఫ్యామిలీకి చెందిన వారు ఒక్కరొక్కరుగా జాయిన్ అవుతూ పవన్‌గా అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే చిరు, వరుణ్, నాగబాబు, పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, పవన్ కల్యాణ్, ఆయన మూడో భార్య అన్నా లెజినోవా మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఆమె 1980లో పుట్టింది. ఈ లెక్కన అన్నా లెజినోవాకు 44 ఏళ్లు.

అలాగే పవన్ కల్యాణ్ 1968 సంవత్సరంలో జన్మించగా.. ప్రస్తుతం 55 ఏళ్ల వయసు కలిగి ఉన్నాడు. అయితే వీరిద్దరి మధ్య ఏకంగా 11 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. కాగా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రేణు దేశాయ్‌తో విడాకులు తీసుకున్నాక అన్నా లెజినోవాను మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికి అంజనా పవనోవా అనే కూతురు కూడా ఉంది. అయితే అన్నా లెజినోవా అప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే.. ఇతర దేశాల్లో వ్యాపారవేత్తగా ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే తప్ప ఇండియాకు రాదు. రీసెంట్‌గా అన్నా లెజినోవా వరుణ్, లావణ్య పెళ్లికి వచ్చింది.


Similar News