డైరెక్టర్ అవతారం ఎత్తిన బోల్డ్ బ్యూటీ.. ఫస్ట్ లుక్‌తోనే అదరగొట్టేసింది

ఇంతకాలం నటిగా సినీ ప్రేక్షకులను, బోల్డ్ అవతార్‌తో కుర్రాళ్లను అలరించిన హాట్ బ్యూటీ దిశా పటానీ ఇక తనలోని డైరెక్టర్‌ని పరిచయం చేసేందుకు రెడీ అయింది. ఈ మేరకు ‘క్యున్ కరు ఫికర్’ అనే ఓ మ్యూజిక్‌

Update: 2023-08-15 05:56 GMT

దిశ, సినిమా: ఇంతకాలం నటిగా సినీ ప్రేక్షకులను, బోల్డ్ అవతార్‌తో కుర్రాళ్లను అలరించిన హాట్ బ్యూటీ దిశా పటానీ ఇక తనలోని డైరెక్టర్‌ని పరిచయం చేసేందుకు రెడీ అయింది. ఈ మేరకు ‘క్యున్ కరు ఫికర్’ అనే ఓ మ్యూజిక్‌ వీడియోతో డైరెక్టర్‌గా డెబ్యూ ఇస్తున్న ఆమె ఇందుకు సంబంధించిన సాంగ్‌ ఫస్ట్‌ లుక్‌ను అభిమానులతో షేర్ చేసుకుంది. బ్లూ కలర్‌ పొట్టి డ్రెస్‌ ధరించి సముద్ర అలల మధ్య కూర్చొని చల్లటి గాలులను ఆస్వాదిస్తున్న దిశా.. ‘మీరు నియంత్రించలేని వాటిని వదిలేస్తే.. అది మీకు స్వేచ్ఛనిస్తుంది. మా ప్రత్యేక ప్రాజెక్ట్‌కి సంబంధించిన స్నీక్ పీక్‌ను షేర్ చేస్తున్నాం. ‘క్యున్ కరు ఫికర్’ 2023 ఆగస్టు 16న @playdmfofficial అధికారిక YouTube ఛానెల్‌లో’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. వయు రాసిన ఈ పాటను వైభవ్‌ పణి కంపోజిషన్‌లో నిఖితా గాంధీ ఆలపించారు. ప్రస్తుతం ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతుంది.

Read More:   అవి నాకు కొత్తేమి కాదు.. హాట్ బ్యూటీ నిక్కీ తంబోలీ వైరల్ కామెంట్స్ 

Tags:    

Similar News