ఉదయ్ కిరణ్ సూసైడ్ ఆలోచనల గురించి డైరెక్టర్ VN ఆదిత్య సంచలన వ్యాఖ్యలు.. నాకు, తేజ, ఆర్పీ పట్నాయక్‌కి ముందే తెలుసు..

ప్రముఖ నటుడు ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయ్ కిరణ్ మరణించి చాలా ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ అతని సినిమాలతో పాటు అతని గురించి మాట్లాడుతూనే ఉంటారు.

Update: 2024-05-07 07:45 GMT

దిశ, సినిమా: ప్రముఖ నటుడు ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయ్ కిరణ్ మరణించి చాలా ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ అతని సినిమాలతో పాటు అతని గురించి మాట్లాడుతూనే ఉంటారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ తో మనసంతా నువ్వే సినిమా తీసి భారీ హిట్ కొట్టిన దర్శకుడు VN ఆదిత్య ఉదయ్ కిరణ్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఉదయ్ కిరణ్ చాలా మంచి మనిషి. చిన్న వయసులోనే పెద్ద సక్సెస్ చూసేసాడు. కానీ దాన్ని హ్యాండిల్ చేయలేకపోయాడు. ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ ఇంకొన్ని ఇబ్బందులు రావడంతో తట్టుకోలేకపోయాడు.

అతనికి ముందు నుంచే సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు ఉన్నాయనీ నాకు, తేజకి, ఆర్పీ పట్నాయక్ కి తెలుసు. అయితే మేమంతా మాట్లాడి దాని నుంచి అతన్ని బయటకు తీసుకురావడానికి ట్రై చేసాము. కానీ ఉదయ్ కిరణ్ మా మాట పట్టించుకోకుండా సూసైడ్ చేసుకున్నాడని VN ఆదిత్య చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Similar News