ఆ డైరెక్టర్‌ని కొట్టిన వాళ్లకు రూ. 10 వేలు ఇస్తా.. దర్శక ధీరుడు రాజమౌళి షాకింగ్ కామెంట్స్ వైరల్

టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ తాజా సినిమా ‘కృష్ణమ్మ’.

Update: 2024-05-02 09:04 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ తాజా సినిమా ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణ కొమ్మలపాటి నిర్మించాడు. అతీరా రాజ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ప్రతి అప్‌డేట్ ఎంతగానో ఆకట్టుకోగా.. తాజాగా రిలీజైన ట్రైలర్‌కు మాత్రం సోషల్ మీడియాలో స్పెషల్ క్రేజ్ వచ్చింది. ఈ నెల 10వ తేదీన థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. కొరటాల శివ ప్రజెంట్ చేస్తున్న ‘క‌ష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకులు రాజమౌళి, అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే రాజమౌళి అనిల్ రావిపూడిపై చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.

మొదట అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘మీ అందరిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. అలాగే నాకు మరో రెండు కోరికలు ఉన్నాయి. ఇదే స్టేజ్‌పై స్పీచ్ స్టార్ట్ చేసేముందు కొరటాల శివ ‘దేవర’ రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పాలి. అలాగే.. రాజమౌళి సినిమాల విషయంపై ఓపినింగ్ డే ఎప్పుడు, అసలు కథ ఏంటీ, ఏ జోనర్ అనేది చెప్పాలి’ అంటూ స్పీచ్ ముగించారు.

రాజమౌళి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాతో ప్రజెంటర్‌గా పరిచయమవుతున్న కొరటాల శివకు శుభాకాంక్షలు. మాములుగా ‘కృష్ణమ్మ’ అంటే అందరూ నార్మల్‌గా తీసుకుంటారు. అదే కొరటాల శివ ప్రజెంట్స్ ‘కృష్ణమ్మ’ అంటే భారీ అంచనాలు ఉంటాయి. కాబట్టి మీరు (కొరటాల శివ) ప్రజెంటర్‌గా చేస్తున్న ఫస్ట్ సినిమాతోనే మంచి హిట్ అందుకోవాలి అనుకుంటున్నారు. హీరో సత్య అండ్ మొత్తం మూవీ టీమ్‌కు ఆల్ ది బెస్ట్’ అని చెప్తూ.. ‘ఎవరైనా సరే ఓ కెమెరా పట్టుకుని వెనకాలే నడుస్తూ ఇంకొకరు అనిల్ రావిపూడి మీద ముసుగు వేసి గుద్దేస్తే వాళ్లకు రూ. 10 వేలు ఇస్తా’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో రాజమౌళి మాటలకు ఒక్కసారిగా షాక్ అయ్యాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా నవ్వులు పూయిస్తుంది. 

Similar News