సినీ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో 'జైలర్' నటుడు మృతి

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ నటుడు, డైరెక్టర్

Update: 2023-09-08 05:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ నటుడు, డైరెక్టర్ మారిముత్తు(57) మృతి చెందారు. ఇవాళ ఉదయం గుండెపోటుతో ఆయన మరణించారు. ఇటీవల రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమాలో కూడా ఆయన ప్రధాన పాత్రలో నటించారు. జైలర్ మూవీలో విలన్‌కు నమ్మకస్తుడిగా ఉండే పాత్రలో తన నటనతో ఆయన ప్రేక్షకులను అలరించారు. ఇప్పటివరకు దాదాపు 100కుపైగా సినిమాల్లో మారిముత్తు నటించారు. ఇటీవల విక్రమ్ సినిమాలో కూడా ఆయన నటించారు.

సన్‌టీవీలో యాంటీ స్విమ్మింగ్ అనే సీరియల్‌తో ఆయన పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాలకు దర్శకత్వం వహించగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా రాణిస్తున్నారు. తమిళ ఇండస్ట్రీలో నటులు, దర్శకులు, నిర్మాతలందరితో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. మారిముత్త మృతితో తమిళ ఇండస్ట్రీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. మంచి నటుడిని కోల్పోయామంటూ భావోద్వేగానికి గురవుతున్నారు.

Read More:   Rahul Sipligunjతో బిగ్ బాస్ Rathika బ్రేకప్.. బయటపెట్టిన బిగ్ బాస్ 

Tags:    

Similar News