డబ్బు కోసం సమంత అలాంటి పని చేసిందా.. వైరల్ అవుతున్న సామ్ తొలి రెమ్యునరేషన్

డబ్బు కోసం సమంత అలాంటి పని చేసిందా

Update: 2024-04-28 07:26 GMT

దిశ, సినిమా: సమంత సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఎంత మంది కొత్త హీరోయిన్లు కనిపించినా సామ్ క్రేజ్ మాత్రం మారడం లేదు. ఈరోజు సమంత పుట్టినరోజు. సామ్ అభిమానులు ఆమె ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సామ్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త ఫోటోలను షేర్ చేస్తున్నారు. సినీ తారలు కూడా సామ్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

తక్కువ కాలంలోనే సామ్ ఫాలోవర్లను సంపాదించుకుంది. దాదాపు స్టార్ హీరోలందరితోనూ నటించింది. సామ్ తమిళం, తెలుగు రెండు భాషల్లో చిత్రాలకు దర్శకత్వం వహించారు. యువ హీరో నాగ చైతన్యను కూడా పెళ్లి చేసుకుని.. తర్వాత కొన్ని కారణాల వల్ల అనుకోకుండా విడిపోయారు. ఆమె పుట్టిన రోజు సందర్బంగా ఈ ముద్దుగుమ్మ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

చదువుకుంటూనే సమంత పాకెట్ మనీ సంపాదించడం కోసం మోడలింగ్‌లోకి అడుగు పెట్టింది. అయితే సామ్ హైస్కూల్‌లో ఉన్నప్పుడు, సామ్ ఒక ఈవెంట్ కోసం అతిథులను వేదికపైకి ఆహ్వానించడానికి వెళ్లిందట. దీనికి ఈమెకు 500 రూపాయలు ఇచ్చారని సమంత తెలిపింది. ఇదే తన తొలి రెమ్యునరేషన్ ఈ బ్యూటీ చాలాసార్లు చెప్పింది. ఇప్పుడు ఒక్కో సినిమా కోసం సమంత కొన్ని కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటోంది. 

Similar News