ఎంతో ప్రాణంగా ప్రేమించిన మొదటి భర్తకు ఆ వ్యక్తి కారణాంగానే మంచు లక్ష్మి విడాకులు ఇచ్చిందా..?

స్టార్ హీరో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి అందరికీ సుపరిచితమే. పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ భామ సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫుల్ క్రేజ్‌ సంపాదించుకుంది.

Update: 2024-05-25 03:48 GMT

దిశ, సినిమా: స్టార్ హీరో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి అందరికీ సుపరిచితమే. పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ భామ సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫుల్ క్రేజ్‌ సంపాదించుకుంది. అలాగే ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. అయితే ఆమె మొదటి భర్త గురించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

ఆమె చదువుకుంటున్న సమయంలోనే తన కాలేజ్ మేట్ అయిన లండన్ శ్రీనివాస్‌ను ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్లిపోయి, పెళ్లి చేసుకున్నది. వాళ్ళ ప్రేమ వివాహాన్ని మంచు మోహన్ బాబు ఒప్పుకోకుండా తన భర్తకు ఎక్కడ ఉద్యోగం దొరకకుండా సంవత్సరం పాటు చాలా ఇబ్బందులు పెట్టాడట. అంతేకాదు అతని కుటుంబ సభ్యులను, బంధువులను రౌడీలను పెట్టి బెదిరించాడట. అయితే ఆయన బెదిరింపులు భరించలేక ఓసారి తండ్రితో ఏదో ఒకటి తేల్చుకుందామని ఇంటికి వచ్చిన మంచు లక్ష్మి మళ్ళీ ఆ ఇంటి నుంచి కాలు బయట పెట్టలేదట. ఎంత ప్రయత్నించినా ఆమె మళ్ళీ తిరిగి రాలేకపోయిందట. దాంతో లండన్ శ్రీనివాస్ అప్పటి పోలీసుల నుంచి ముఖ్యమంత్రి వరకు మొరపెట్టుకున్న ఎవరు పట్టించుకోలేదట.

చివరికి తన భర్తకు తన వల్ల ముప్పు ఉంది కాబట్టి ఇక ఆ వివాహానికి అర్థం లేదు అని మంచు లక్ష్మి అతడితో విడిపోయింది. ఇండియాలోనే ఉంటే తన మనసు మళ్ళి మారుతుంది అని మంచు మోహన్ బాబు, లక్ష్మిని అమెరికా పంపించి థియేటర్ కోర్సు నేర్పించగా అక్కడ కూడా ఒక సీరియల్ ఆర్టిస్ట్ తో ప్రేమలో పడింది అని తెలియగానే తీసుకొచ్చి ఆండ్రీ శ్రీనివాస్ తో పెళ్లి జరిపించారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.

Similar News