సూసైడ్ చేసుకుంటానని హేమ వారిని బెదిరించిందా .. వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజాలు

బెంగుళూరు రేవు పార్టీ వ్యవహారం రోజు రోజుకు ముదిరిపోతోంది.

Update: 2024-05-24 07:24 GMT

దిశ, సినిమా: బెంగుళూరు రేవు పార్టీ వ్యవహారం రోజు రోజుకు ముదిరిపోతోంది. తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హేమ పోలీసులను కూడా బెదిరించినట్టు బయటకు వచ్చింది. బర్త్ డే పార్టీని రేవు పార్టీలా మార్చేసి నానా రచ్చ చేసారు. ఈ పార్టీని ఒక రోజు కాకుండా మూడు రోజులు చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారని పోలీసులు తెలిపారు.

ఈ లిస్టులో తన పేరు బయటకు వస్తే వెంటనే సూసైడ్ చేసుకుంటానని హేమ బెంగళూరు పోలీసులను బెదిరించినట్లుగా తెలుస్తోంది. ఆమె పేరు ఎక్కడా బయటకు రాకూడదని చివరి వరకు ప్రయత్నించింది. కానీ, పోలీసులే ఆమెకి శత్రువులు అయ్యారు. వాళ్లు రిలీజ్ చేసిన ఫోటోలోని డ్రస్.. ఈమె రిలీజ్ చేసిన వీడియోలో డ్రస్ మ్యాచ్ అవ్వడంతో అడ్డంగా బుక్ అయింది. అయినా కూడా మీడియాను పక్క దోవ పట్టిస్తూ ఓ ప్రైవేట్ వెహికల్‌లో హైదరాబాద్‌కు బయల్దేరినట్లుగా పోలీసులు వెల్లడించారు.

రేవ్ పార్టీకి హాజరైన చాలామందితో హేమకు పరిచయాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు పోలీసులు నోటీసులు జారీ చేయడంతో మరో మూడు రోజుల్లో ఆమె బెంగళూరు సీసీబీ ఎదుట హాజరుకావాల్సి ఉంది.

Similar News