సీరియల్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన చనిపోయిన చందూ.. మరణానికి ముందు సేమ్ టు సేమ్ సీన్!

బుల్లితెర ఇద్దరు నటులను కోల్పోయిన విషయం తెలిసిందే. సీరియల్ నటి పవిత్రా జయరామ్ మరణాన్ని భరించలేకపోయిన సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే వీరిద్దరు సహజీవనంలో ఉండటం,

Update: 2024-05-24 07:42 GMT

దిశ, సినిమా : బుల్లితెర ఇద్దరు నటులను కోల్పోయిన విషయం తెలిసిందే. సీరియల్ నటి పవిత్రా జయరామ్ మరణాన్ని భరించలేకపోయిన సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే వీరిద్దరు సహజీవనంలో ఉండటం, ఆమె సర్వస్వం అన్నట్లుగా బతకడం వల్లనే తాను సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది.

అయితే చందూ పలు సీరియల్స్‌లలో నటిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మాటీవీలో ఫేమస్ సీరియల్ కార్తీక దీపం2లో చందూ నటిస్తున్నాడు. పారిజాతం దగ్గర నమ్మిన బంటుగా ఆయన ఉంటాడు. అయితే ఈ మధ్య ( బుధవారం ) ఎపిసోడ్‌లో ఆయన కనిపించి అందరి కంట కన్నీరు తెప్పించారు. చనిపోయిన వారం రోజుల తర్వాత అతను సీరియల్‌లో కనిపించడం చాలా మందికి బాధను కలిగించింది. అయితే ఈ ఎపిసోడ్‌లో తాను మాట్లాడిన కొన్ని మాటలను విన్న జనాలు.. చందూ తాను చనిపోతానని ముందే తెలిసిందా.. ఈ సీరియల్‌లో సేమ్ టు సేమ్ సీన్ అంటూ ఓ న్యూస్ వైరల్ చేస్తున్నారు.

అసలు విషయంలోకి వెళితే.. సీరియల్‌లో బంటుకు దీప భర్త గురించి తెలుసుకొమ్మని ఆ ఊరు వెళ్లమని చెప్పడం, కార్తీక్ , దీప మధ్య బంధం గురించి తెలుసుకొమ్మని చెప్పడం జరుగుతుంది. ఈ క్రమంలోనే బంటూ (చందూ) మీరే మీ బుర్రకు పని చెప్పండి అమ్మగారు అని అడగ్గా.. ఆమె కర్ర తీసుకొని బంటు తల మీద కొడుతుంది. ఆయనకు తీవ్రంగా గాయం అవుతుంది. అయితే ఇదంతా బంటూ చనిపోవడానికి చేసిన షూటింగ్ పార్ట్. అయితే సీరియల్‌లో ఎలాగైతే చందు తలకి గాయం అవుతుందో.. యాక్సిడెంట్‌లో కూడా అలాగే అవుతుంది. దీంతో ఇది చూసిన ఆయన అభిమానులు చందూ తాను చనిపోవడం గురించి ముందే హింట్ ఇచ్చాడంటూ ట్రోల్ చేస్తున్నారు.

Similar News