ప్రస్తుతం ఓ కొత్త దశను అనుభవిస్తున్నా : Samantha

స్టార్ హీరోయిన్ సమంత ‘ఖుషి’ సినిమాతో తన అభిమానులను ఖుష్ చేసేందుకు సిద్ధమవుతోంది.

Update: 2023-08-28 12:45 GMT

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత ‘ఖుషి’ సినిమాతో తన అభిమానులను ఖుష్ చేసేందుకు సిద్ధమవుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 1న విడుదలకానుంది. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ మూవీనీ ప్రమోట్ చేస్తున్న నటి.. తాజాగా ఒక సంవత్సరం పాటు సినిమాలకు దూరంగా బ్రేక్ ఇవ్వబోతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించింది. ‘నా 13ఏళ్ల సినీ కెరీర్‌లో ఎప్పుడు బ్రేక్ ఇవ్వలేదు. కానీ తొలిసారిగా సినిమాల నుంచి విరామం తీసుకుంటున్నా. ఎందుకంటే ప్రస్తుతం నేను ఓ కొత్త దశని అనుభవిస్తున్నా. ఈ దశలో ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తున్నా. నా జీవితంలో ఇప్పుడు చాలా ఖుషీగా ఉన్నాను’ అంటూ హ్యాపీగా చెప్పుకొచ్చింది. ప్రజంట్ సామ్ కామెంట్స్ వైరల్ అవుతుండగా ఇదంతా ఖుషి సినిమా ఎఫెక్ట్ అంటున్నారు ఫ్యాన్స్.

Tags:    

Similar News