ఏడేళ్ల తర్వాత ఓటీటీలోకి వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

సందీప్ కిషన్ హీరోగా వచ్చిన సినిమా ‘మాయావన్’.

Update: 2024-05-27 09:13 GMT

దిశ, సినిమా: సందీప్ కిషన్ హీరోగా వచ్చిన సినిమా ‘మాయావన్’. 2017లో తమిళంలో వచ్చిన ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో మంచి హిట్ అందుకుంది. తర్వాత తెలుగులోకి ‘ప్రాజెక్ట్ Z’ పేరుతో డబ్ చెయ్యగా.. థియేటర్లలో అంతగా సక్సెస్ కాలేకపోయింది. అయితే.. ప్రస్తుతం ఈ చిత్రం హిందీ వెర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో, తమిళ వెర్షన్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతూ బాగా రీచ్ తెచ్చుకోవడంతో.. తెలుగు వెర్షన్ ఓటీటీకి ప్లాన్ చేశారు మేకర్స్.

ఈ మేరకు ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకోగా.. మే 31 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇందులో సందీప్ కిషన్‌కు జంటగా లావణ్య త్రిపాఠి నటించింది. కాగా.. ఇప్పుడు ఈ మూవీ ‘మాయా-వన్’ టైటిల్‌తో సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే థియేటర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

Similar News