విశ్వంభరపై పెరిగిపోతున్న అంచనాలు.. చిరుతో ఐదుగురు హీరోయిన్ల రొమాన్స్

మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ ఇసుమంత కూడా తగ్గట్లేదు. తాజాగా పద్మ విభూషణ్ కూడా అందుకున్న ఆయన.. వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు.

Update: 2024-05-24 10:51 GMT

దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ ఇసుమంత కూడా తగ్గట్లేదు. తాజాగా పద్మ విభూషణ్ కూడా అందుకున్న ఆయన.. వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. త్వరలో ' విశ్వంభర ' తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వశిష్ఠ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో ఇప్పటి వరకు త్రిష పేరు మాత్రమే వినిపించింది. కానీ ఇందులో ఆమెతో సహా ఐదుగురు హీరోయిన్లు కనిపించబోతున్నట్లు ఫిల్మ్ నగర్ లో న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఆషికా రంగనాథ్, మీనాక్షీ చౌదరి, సురభి, ఈషా చావ్లా కూడా ఇందులో నటించనున్నారని తెలుస్తుంది. అయితే ఇందులో స్మైలీ క్వీన్ మెయిన్ హీరోయిన్ కాగా మిగతా నలుగురు సపోర్టింగ్ ఆర్టిస్ట్ లని సమాచారం. కాగా వీరికి కూడా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ పడినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక దీనిపై స్పందిస్తున్న చిరు అభిమానులు.. ఈ ఏజ్ లో కూడా అన్న తగ్గేదేలే అంటున్నాడని, ఇంత మందితో రొమాన్స్ చేయబోతున్నాడని చర్చించుకుంటున్నారు. కానీ విమర్శకులు మాత్రం దారుణమైన సెటైర్స్ వేస్తున్నారు. అంతమందితో హాస్టల్ నడుపుతాడా ఏంటి అని ట్రోల్ చేస్తున్నారు. ఐదుగురు ఉన్నారంటే 'హిట్లర్ 2' ప్లాన్ చేశారా? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా త్రిష ఇప్పటికే సెట్స్ లో జాయిన్ కాగా ఆమె పోర్షన్ కంప్లీట్ అయినట్లు సమాచారం.

Read More..

చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాలో మరో టాలెంటెడ్ హీరోయిన్ కన్ఫర్మ్.. ఆ బ్యూటీ ఎవరంటే?

Similar News