రవితేజ బర్త్ డే‌ సందర్భంగా చిరంజీవి స్పెషల్ ట్వీట్!

ఇటీవల వచ్చిన 'వాల్తేరు వీరయ్య' మూవీతో మంచి సక్సెస్‌ను అందుకున్నాడు చిరంజీవి.

Update: 2023-01-26 11:20 GMT

దిశ, సినిమా: ఇటీవల వచ్చిన 'వాల్తేరు వీరయ్య' మూవీతో మంచి సక్సెస్‌ను అందుకున్నాడు చిరంజీవి. బాబి తెరకెక్కించిన ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా నటించారు. ఈ ఇద్దరి కాంబో స్క్రీన్‌పై చూసి ఫుల్ ఖుషి అయ్యారు అభిమానులు. ఇక ఈ రోజు రవితేజ బర్త్ డే సందర్భంగా మెగాస్టార్ చిరు ఆసక్తికర ట్వీట్ చేశారు. 'నా తమ్ముడు రవితేజకి జన్మదిన శుభాకాంక్షలు. హాయిగా ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండేలా దీవించమని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నా' అని ఆశీర్వదించాడు. దీంతో పాటు వారిద్దరు కలిసున్న ఫొటోను నెట్టింట షేర్ చేశాడు.

ఇవి కూడా చదవండి:  కష్టాల్లో దగ్గరై నాలో స్ఫూర్తి నింపినందుకు ధన్యవాదాలు: సామ్ పోస్ట్ వైరల్! 

Tags:    

Similar News