నాగబాబుకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రాజకీయాల వల్ల వివాదాలు పెరుగుతున్నాయి.

Update: 2024-05-16 02:54 GMT

దిశ, సినిమా: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రాజకీయాల వల్ల వివాదాలు పెరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో నాగబాబు పేరు ఏ రేంజ్ లో వైరల్ అయిందో మనందరికి తెలిసిందే. ఈ సారి తమ్ముడు పవన్ కళ్యాణ్ నిఎలా అయినా గెలిపించాలని నాగబాబు చాలా కష్ట పడ్డారు. తెలిసి తెలియక ఒక మాట జారినా తన వలన కళ్యాణ్ బాబుకి ఎక్కడ నెగెటివిటీ ఏర్పడుతుందేమో అని సైలెంట్ గా ఉండిపోయాడు అంటూ సినీ విశ్లేషకులు చెప్పుకొచ్చారు.

అయితే ఎలక్షన్స్ పోలింగ్ అయిపోయిన వెంటనే నాగబాబు చేసిన ట్వీట్ అందర్ని షాక్ కి గురి చేసింది. అసలు ఇలా చేయాల్సిన అవసరం ఏంటని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కొంతమంది నాగబాబుతో వచ్చిన సమస్య ఇదే .. అంటూ చెబుతున్నారు. అసలు ఆ ట్వీట్ అల్లు అర్జున్ కి ఉద్దేశించి పెట్టాడా లేక మరోకొకరి కోసం పెట్టాడా అన్నది ఎవరికి తెలీదు. కానీ, ఆ ట్వీట్ అల్లు అర్జున్ కోసం పెట్టినట్టే ఉందంటూ అల్లు ఫ్యాన్స్ నాగబాబుని ట్రోల్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతుంది. ఈ ట్వీట్ గురించి నాగబాబుకు, చిరంజీవి స్ట్రైట్ గా వార్నింగ్ ఇచ్చారని తెలిసిన సమాచారం “మన కుటుంబ సమస్యలు గురించి మనమే బయట పెట్టుకుని పరువు పోగొట్టుకోవడం అవసరమా.. అసలు సోషల్ మీడియాలో పెట్టడం ఎందుకంటూ నాగబాబుకి పరోక్షకంగా చిరంజీవి ఇచ్చారట.

ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ బాగా వైరల్ అయిపోతుంది. అయితే, అల్లు అర్జున్ అభిమానులు చిరంజీవికి సపోర్ట్ చేస్తూ ఇలా కాదు.. ముందు పవన్ కళ్యాణ్ కి కూడా ఇవ్వండి.. రాజకీయాల్లోకి వస్తే వచ్చారు.. కానీ అతని దగ్గర స్థిమితం లేదు, ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలీదు.. ఒక నిదానం లేదు, ఒక సంస్కారం కూడా లేదు.. పవన్ సినిమాల్లో ఉంటే ఇన్ని గొడవలు అయ్యేవి కూడా కావని నెటిజెన్స్ ఏకిపారేస్తున్నారు.. మరి కొంతమంది చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఏం లాభం సార్.. ఫైర్ అవుతున్నారు.

Similar News