నాగబాబుని పొట్టు పొట్టు కొట్టిన చిరంజీవి.. ఆయన చేసిన తప్పేంటో తెలిస్తే షాక్ అవుతారు!

మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-05-26 15:45 GMT

దిశ, సినిమా: మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారి మధ్య ఉన్న ఆప్యాయతకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అలాగే మెగాస్టార్ చిరంజీవికి తన తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టం. ప్రతిసారి ఏదోఒక సందర్భంలో వారి ప్రస్తావన తీసుకొస్తూ చెప్పుకొస్తారు. ఈ క్రమంలోనే ఒకసారి చిరంజీవి నాగబాబును కొట్టారంటా. అయితే.. ఆయన నాగబాబుని ఎందుకొట్టారు.. తన తమ్ముడు చేసిన తప్పు ఏంటీ అనేది ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు చెప్పొకచ్చారు మెగాస్టార్ చిరంజీవి.

‘నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో అమ్మకు సహాయంగా ఉండేవాడిని. ఇంటిపనుల్లో హెల్ప్ చేసేవాడిని. ఈ క్రమంలోనే ఒక రోజు లాండ్రీ నుండి బట్టలు తేవాల్సి ఉంది. అదే సమయంలో మరొక పని కూడా పడింది. నేను ఎమర్జన్సీగా బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఆ టైంలో లాండ్రీ దగ్గరకు వెళ్లి బట్టలు తెమ్మని నాగబాబుకు చెప్పి నేను బయటకు వెళ్లాను. ఇంటికి వచ్చాక బట్టలు తెచ్చావా అని అడిగితే.. లేదు నిద్రపోయాను అని సమాధానం చెప్పాడు నాగబాబు. దాంతో కోపం వచ్చి నాగబాబు కొట్టేశాను. నాగబాబును కొట్టినందుకు అమ్మ నాపై కోప్పడింది. సాయంత్రం నాన్న వచ్చాక జరిగింది అంతా చెప్పాను. నాగబాబును నాన్న మందలించాడు. అప్పుడు నాకు సంతృప్తిగా అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చిరంజీవి కామెంట్స్ నెట్టింట మరోసారి వైరల్ అవుతున్నాయి. 

Similar News