Ram Charan: మా బిడ్డ కడుపులో ఉండగానే మాకు అదృష్టాన్ని తెచ్చిపెడుతోంది : చరణ్

‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఆస్కార్ అవార్డు సాధించడంతో దేశమంతటా సినీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Update: 2023-03-13 08:08 GMT

దిశ, సినిమా: ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఆస్కార్ అవార్డు సాధించడంతో దేశమంతటా సినీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆనందానికి అవధులు లేవు. ఇక బ్లాక్ సూట్‌లో చరణ్.. సంప్రదాయ చీరకట్టులో ఉపాసన చాలా అందంగా కనిపించారు. అయితే చరణ్ ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన ఉపాసన ‘నేను కూడా ఈ మూవీ కుటుంబంలో భాగం అయినందుకు చాలా సంతోషిస్తున్నా’ అని చెప్పింది. తర్వాత ‘తాను 6 నెలల గర్భవతి. మా బిడ్డకు అప్పుడే గొప్ప ప్రేమ లభిస్తుంది. కడుపులో ఉండగానే మా బిడ్డ ఇంతటి అదృష్టాన్ని తెచ్చిపెడుతోంది’ అంటూ చరణ్ ఎమోషనల్ అయ్యాడు.

Full View

Tags:    

Similar News