శ్రీదేవికి మొదటి అవకాశం ఇచ్చింది చంద్రమోహన్‌నే.. 16 ఏళ్ల వయసులోనే..!

తెలుగు ప్రజలకు సినీ నటుడు చంద్రమోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దాదాపు ఏడు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో ముఖ్య నటుడిగా కొససాగుతున్నారు.

Update: 2023-11-11 08:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ప్రజలకు సినీ నటుడు చంద్రమోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దాదాపు ఏడు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో ముఖ్య నటుడిగా కొససాగుతున్నారు. 1966లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన.. 2022 వరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. హీరోగా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చంద్రమోహన్ నటన అద్భుతమనే చెప్పాలి. హైట్ తక్కువగా ఉన్నా.. ఎంతో మంది హైట్ ఉన్న హీరోయిన్లతో ఆడిపాడి మెప్పించారు. ఇక ఆయన కెరీర్‌లో 1978లో వచ్చిన పదహారేళ్ల వయసు సినిమా బిగ్గెస్ట్ హిట్ అనే చెప్పాలి. ఆయన సినీ జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం అది. అందాల తార శ్రీదేవి హీరోయిన్‌గా నటించిన మొదటి చిత్రం కూడా అదే. కె.రాఘవేందర్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చంద్ర మోహన్ అమాయకపు పాత్రలో జీవించారు. టాలీవుడ్ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన ఈ చిత్రం అటు శ్రీదేవి సినీ కెరీర్‌ను కూడా మలుపు తిప్పి సినీ ఇండస్ట్రీలో అగ్రహీరోయిన్ స్థానాన్ని కట్టబెట్టింది. 

Read More..

చంద్రమోహన్‌తో ఒక్కసారి చేస్తే చాలు.. పడిచచ్చిన అలనాటి హీరోయిన్లు..  

Tags:    

Similar News