బ్రేకింగ్.. Nandamuri Tarakaratna హెల్త్ కండిషన్‌పై Nandamuri Balakrishna కీలక అప్డేట్

బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బాలకృష్ణ కీలక అప్డేట్ ఇచ్చారు.

Update: 2023-01-29 06:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బాలకృష్ణ కీలక అప్డేట్ ఇచ్చారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన బాలయ్య.. తారకరత్న పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. నిపుణుల వైద్య బృందం తారకరత్నకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని చెప్పారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని కోరకుంటున్నామన్నారు. ప్రస్తుతానికి స్టెంట్లు వేయడం కుదరలేదని.. తారకరత్నకు మళ్లీ హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. తారకరత్న ఆరోగ్యం మెరుగుపర్చేందుకు వైద్యులు అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. అభిమానులు తారకరత్న కోసం ప్రార్థించాలని బాలయ్య కోరారు. ఆసుపత్రిలో ఉన్న తారకరత్నను పరామర్శించేందుకు వచ్చిన కన్నడ స్టార్ హీరో పునీత్ శివ రాజ్ కుమార్ బాలయ్య ధన్యవాదాలు తెలిపారు.  

Also Read..

Tarakaratna చికిత్సకు స్పందిస్తున్నారు: Hero Puneeth Shivraj Kumar

Tags:    

Similar News