రెచ్చిపోయి స్కిట్ చేసి బుల్లెట్ బాస్కర్.. పెళ్లాం అది, ఫిగర్ ఇది అంటూ కామెంట్స్!

బుల్లితెరపై ఎక్కవగా నవ్వించే కామెడీ షో ఏదైనా ఉన్నదా అంటే అది జబర్దస్త్ మాత్రమే. ఈ కామెడీ షో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అంతే కాకుండా ఇందులో కామెడీ చేసిన వారు మంచి గుర్తింపు తెచ్చుకొని వెండితెరపై

Update: 2024-05-22 09:44 GMT

దిశ, సినిమా : బుల్లితెరపై ఎక్కవగా నవ్వించే కామెడీ షో ఏదైనా ఉన్నదా అంటే అది జబర్దస్త్ మాత్రమే. ఈ కామెడీ షో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అంతే కాకుండా ఇందులో కామెడీ చేసిన వారు మంచి గుర్తింపు తెచ్చుకొని వెండితెరపై అడుగు పెట్టి వరస ఆఫర్స్‌తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ కామెడీ షో ద్వారా చాలా మంది మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు. అందులో బుల్లెట్ భాస్కర్ ఒకరు. ఆయన తన పంచ్‌లు, కామెడీ టైమింగ్‌తో అందరినీ కడుపుబ్బా నవ్విస్తాడు. కాగా, తాజాగా ఈయన స్కిట్‌కు సంబంధించిన ఓ ప్రోమో రిలీజ్ అయ్యింది.

అందులో ఆయన పూలరంగడి వేషాలు వేస్తూ కనిపిస్తాడు. దీంతో అతన్ని చూసిన పనోడు క్యారెక్టర్ చేసిన వ్యక్తి.. నీకు సిగ్గులేదా? ఇంట్లో బంగారం లాంటి భార్య ఉండగా, ఇలా అందరి చుట్టూ తిరుగుతావని అంటాడు. అప్పుడు భాస్కర్ పెళ్లాం అనేది ఫర్నీచర్ లాంటిది. ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది. ఉండాలి కూడా అంటాడు. అలాగే ఫిగర అనేది పెర్ఫ్యూమ్ లాంటిది. గంట ఉన్నా సరిపోద్దీ అని రష్మిని చూస్తూ సమాధానం చెప్తాడు. దీంతో రష్మీ కాస్త కోపంగా చూసినట్లు చూసి స్మైల్ ఇస్తుంది. ఈ స్కిట్ డైలాగ్స్ చూసి అక్కడున్నవారందరూ నవ్వుతారు. ప్రస్తుత ప్రోమోలో ఈ స్కిట్ హైలెట్‌గా నిలించింది. దీంతో ఇది కాస్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ షోకి రష్మి యాంకరింగ్ చేయగా, ఖుష్బు, క్రిష్ణభగవాన్ జడ్జీలుగా చేస్తున్న విషయం తెలిసిందే.

Similar News