హైదరాబాద్ ఫేమస్ రెస్టారెంట్లలో కల్తీ.. బ్రహ్మాజీ సెటైరికల్ రియాక్షన్ ఇదే..

ఈ మధ్య ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ హైదారాబాద్ లోని పలు రెస్టారెంట్స్, కేఫ్ లపై దాడులు నిర్వహించారు. మంచి బ్రాండ్ ఉన్నా చెడిపోయిన కూరగాయలు,

Update: 2024-05-24 09:07 GMT

దిశ, సినిమా : ఈ మధ్య ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ హైదారాబాద్ లోని పలు రెస్టారెంట్స్, కేఫ్ లపై దాడులు నిర్వహించారు. మంచి బ్రాండ్ ఉన్నా చెడిపోయిన కూరగాయలు, నిల్వ చేసిన ఆహారం, ఎక్స్ పైర్డ్ డేట్ కలిగిన వస్తువులను యూజ్ చేస్తున్నట్లు హెచ్చరించారు. దాదాపు మంచి పేరున్న అన్ని హోటల్స్‌లో ఫుడ్ కల్తీ అయిందని వివరించారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఈ ఫేమస్ ఔట్ లెట్స్ పేర్లు కూడా ప్రచురించారు. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో సినీ నటుడు బ్రహ్మాజీ ఈ ఇష్యూపై సెటైరికల్‌గా స్పందించాడు. కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ట్వీట్‌కు రియాక్ట్ అవుతూ.. ‘సార్.. మరి ఎక్కడ తినమంటారు? ఇంట్లోనా? ’ అని ఫన్నీగా ప్రశ్నించాడు.

ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఎంతైనా బ్రహ్మాజీ రియాక్షన్ వేరే లెవల్ ఉంటుందని అంటున్నారు. ‘ఎవరైనా ఇంట్లో తింటున్నారా? అనవసరంగా హోటల్స్‌లో తింటూ డబ్బులు దండగ చేస్తున్నారు.. హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నారని ఆయన చెప్పాలనుకున్నాడు’, ‘అవును కదా బ్రహ్మాజీగారు అసలు వీళ్లు ఏం చెప్పాలని అనుకుంటున్నారు? సమజ్ అయితలేదు.. ఎన్ని చెప్పినా అక్కడికే వెళ్తం కదా’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News