Megastar Vs King Nagarjuna.. దసరా బరిలో గెలిచేదెవరు?

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2022-08-22 03:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తరం హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తున్నారు. తెరపైనే కాకుండా తెర వెనుక కూడా వీరిద్దరూ మంచి స్నేహితులు. అయితే ఇప్పడు వీరిద్దరి మధ్య బాక్సాఫీస్ వార్ మొదలైంది. ఈ ఇద్దరి సినిమాలు ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

దసరా సీజన్‌ని టార్గెట్ చేసుకుని మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్'.. కింగ్ నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' సినిమాలు అక్టోబర్ 5న అభిమాలనులను అలరించనున్నాయి. ది ఘోస్ట్ రిలీజ్ డేట్ ముందే ఖరారు కాగా.. గాడ్ ఫాదర్ రిలీజ్ డేట్‌ను తాజాగా విడుదల చేశారు. ఇటీవలే నాగార్జున, చిరంజీవి ఇద్దరికి అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురుకాగా.. ఇప్పుడు ఒకేసారి స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధం అవుతుండడంతో ప్రేక్షకులలో ఉత్కంఠ మొదలయ్యింది. ఇక ఈ రెండు సినిమాలలో ఏ మూవీ హిట్ టాక్‌ను సొంతం చేసుకోబోతుందో చూడాల్సి ఉంది.

థాంక్యూ పవన్ కల్యాణ్ సర్.. ఇది చాలు మాకు: నిఖిల్ 

Tags:    

Similar News