Bollywood: నేను ఏ అమ్మాయితో సహజీవనం చేయలేదు: బాలీవుడ్ హీరో

బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ ఖన్నా తనకు 48 ఏళ్లు దాటుతున్న ఇంకా బ్రహ్మచారిగానే ఉన్నానంటున్నాడు.

Update: 2023-03-28 08:01 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ ఖన్నా తనకు 48 ఏళ్లు దాటుతున్న ఇంకా బ్రహ్మచారిగానే ఉన్నానంటున్నాడు. మంగళవారం పుట్టినరోజు జరుపుకుంటున్న ఆయన ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడానికి కారణాన్ని వెల్లడించాడు. ‘పెళ్లి అనే విషయాన్ని నేను సీరియస్‌గా తీసుకోను. వైవాహిక జీవితం పర్సనల్ లైఫ్‌పై చాలా ప్రభావం చూపుతుంది. వివాహం అనేది జీవితంలో ప్రతిదానిని మార్చేస్తుంది. నేను నా లాగే ఉండడానికి ఇష్టపడతా. పెళ్లి పేరుతో నా జీవితంలోకి వచ్చిన యువతి నన్ను మార్చడం ఇష్టం లేదు. అందుకే ఇలాగే ఉండి పోయా. ఉండి పోతాను కూడా. అంతేకాదు నేను ఇంతవరకు ఏ అమ్మాయితో సహజీవనం చేయలేదు’ అంటూ తన ఫీలింగ్స్ వెల్లడించాడు.

ఇవి కూడా చదవండి: Kiran Abbavaram: ఎందుకు పనికిరావు.. వరెస్ట్ అని ఎగతాళి చేశారు?

Tags:    

Similar News