బర్త్‌డే స్పెషల్.. ‘పుష్ప 2’ నుంచి రావు రమేష్ పోస్టర్ రిలీజ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న సినిమా ‘పుష్ప 2’.

Update: 2024-05-25 13:14 GMT

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న సినిమా ‘పుష్ప 2’. నేషనల్ క్రష్ రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ‘పుష్ప: ది రైజ్’ కు సీక్వెల్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ కావడంతో.. పార్ట్ 2 పై ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేముకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అంచనాలకు తగ్గట్లుగానే ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా.. టీజర్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది.

ఈ క్రమంలోనే నేడు రావు రమేష్ పుట్టిన రోజు సందర్భంగా మూవీ నుంచి ఆయన పోస్టర్‌ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఈ మేరకు ‘ప్రతి పాత్రను పోషించే డైనమిక్ నటుడు - రావు రమేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ‘పుష్ప 2: ది రూల్’లో అతనిని శక్తివంతమైన రాజకీయ నాయకుడు 'సిద్దప్ప'గా చూడండి’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా.. ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.

Similar News