షారుఖ్‌ను సజీవ దహనం చేస్తానన్న సాధువు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నెటిజన్

ఇప్పటికే ఎంతోమంది దీపిక డ్రెస్సింగ్‌పై తమదైన స్టైల్‌లో మండిపడుతుండగా తాజాగా అయోధ్యకి చెందిన ఓ సాధువు షారుఖ్‌ కలిస్తే సజీవ దహనం చేస్తానని ప్రకటించాడు.

Update: 2022-12-22 07:27 GMT

దిశ, సినిమా : షారుఖ్ ఖాన్, దీపికల అప్ కమింగ్ సినిమా 'పఠాన్'పై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎంతోమంది దీపిక డ్రెస్సింగ్‌పై తమదైన స్టైల్‌లో మండిపడుతుండగా తాజాగా అయోధ్యకి చెందిన ఓ సాధువు షారుఖ్‌ కలిస్తే సజీవ దహనం చేస్తానని ప్రకటించాడు. విషయానికొస్తే..అయోధ్య తపస్వి ఛావ్నీకి చెందిన 'మహంత్ పరమహంస ఆచార్య' రీసెంట్‌గా ఓ సమావేశంలో మాట్లాడుతూ.. 'మన సనాతన ధర్మానికి చెందిన ప్రజలంతా కలిసి పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నాం. షారుఖ్ పోస్టర్‌ను తగలబెట్టాం. ఒకవేళ నేను అతన్ని కలిస్తే అతన్ని భగభగ మండే మంటల్లో సజీవ దహనం చేస్తా' అంటూ ఫైర్ అయ్యాడు. అలాగే 'బేషరమ్ రంగ్' పాటలో కాషాయ రంగును దారుణంగా అవమానించారని, మూవీని బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చాడు. అంతేకాదు 'పఠాన్‌' సినిమాను థియేటర్లలో విడుదల చేస్తే వాటిన్నింటిని తగులబెడతానని వార్నింగ్ ఇవ్వడం విశేషం. కాగా దీనిపై స్పందించిన ఓ నెటిజన్.. 'ఇది అసహ్యకరమైనది.. 2021 అక్టోబర్ 2 నాటికి భారత్‌ను హిందూ దేశంగా ప్రకటించకుంటే జల సమాధి చేసుకుంటానని బెదిరించిన గురువు పరమహంస ఆచార్య ఇప్పుడు #SRKని బెదిరిస్తున్నాడు. అసలు ఇలాంటి గురువులకు మద్దతిచ్చే పార్టీలను బహిష్కరించాలి' అంటూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. 

Also Read..

ఇది నా మనసుకు దగ్గరైన చిత్రం: అనుపమ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ 

Tags:    

Similar News