దర్శకుడిగా మారనున్న ఆటో రాంప్రసాద్.. హీరో ఎవరంటే?

దర్శకుడిగా మారనున్న ఆటో రాంప్రసాద్.

Update: 2024-05-24 02:33 GMT

దిశ, సినిమా: ప్రముఖ టీవీ ఛానెల్‌లో ప్రసారమైన “జబర్దస్త్” షో చాలా మందికి జీవితాన్ని ఇచ్చింది. ఈ షో వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకి ఎంతో మంది పరిచయమయ్యారు. హీరోలుగా, నటీనటులుగా, దర్శకులుగా, సహాయ నటులుగా, సాంకేతిక నిపుణులుగా.. జబర్ధస్త్ కమెడియన్స్ ఇలా అనేక రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. షకలక శంకర్, సుడిగాలి సుధీర్ హీరోలుగా పరిచయం అయ్యారు.

క్రేజీ దర్శకుల జాబితాలో బలగం వేణు యెల్దండి చేరిపోయాడు. ధన రాజ్ త్వరలో రామ్ రాఘవం సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. అలాగే హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, మహేష్, రాకెట్ రాఘవ తదితరులు హ్యాపీగా సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. అయితే వేణు, ధన్‌రాజ్‌ల మాదిరిగానే జబర్దస్త్‌లో మరో కమెడియన్‌ డైరెక్టర్ గా మారనున్నాడు. అతను ఎవరో కాదు.. ఆటో పంచులతో బుల్లితెర ప్రేక్షకులను నవ్విస్తున్న ఆటో రామ్ ప్రసాద్ త్వరలో దర్శకుడిగా మారనున్నాడని తెలుస్తోంది.

సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రామ్ ప్రసాద్.. ఈ ముగ్గురూ కలిసి జబర్దస్త్ వేదికపై చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈ ముగ్గురూ తెరపైనే కాదు నిజ జీవితంలోనూ బెస్ట్ ఫ్రెండ్స్. ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన సుడిగాలి సుధీర్, గెటప్ శీనుని హీరోలుగా పెట్టి ఆటో రామ్  ప్రసాద్ ఓ సినిమా చేయనున్నాడని సమాచారం. మంచి వినోదాత్మక కామెడీ చిత్రాన్ని రూపొందించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే తన సినిమాను అధికారికంగా ప్రకటిస్తానని ఆటో రాం ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Similar News