Vijay Devarakonda: విజయ్ దేవరకొండ స్టైలీష్ గాగుల్స్ అంత ఖరీదా ?

'ఖుషి' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ.

Update: 2023-12-02 06:05 GMT

దిశ,వెబ్ డెస్క్:'ఖుషి' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ఇప్పుడు 'ఫ్యామిలీ స్టార్' మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీకి పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. 'ఫ్యామిలీ స్టార్' నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ అందర్ని ఆకట్టుకున్నాయి. నిర్మాత దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల ప్రేక్షకుల ముందుకు రానుంది.

జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో విజయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.మొజాయిక్ ప్యాచ్‌లతో సెట్ చేసిన చిక్ ఆఫ్ వైట్ హుడీతోపాటు.. లగ్జరీ బ్రాండ్ గివెన్చీ గాగూల్స్ ధరించాడు. సెలబ్రెటీ అవుట్ ఫిట్స్ డీకోడ్ అనే ఇన్ స్టా పేజీ ప్రకారం.. విజయ్ ధరించిన స్టైలిష్ గాగుల్స్ ధర అక్షరాల రూ.1.58 లక్షలు. కేవలం గాగుల్స్ కే లక్ష పెట్టడం అవసరమా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం విజయ్ న్యూలుక్.. స్టైలిష్ గాగుల్స్ ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Similar News