'AP04 రామాపురం'.. రెండో పాట విడుదల

రామ్ జక్కల, అఖిల ఆకర్షణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘AP04 రామాపురం’.

Update: 2022-11-14 13:37 GMT

దిశ, సినిమా : రామ్ జక్కల, అఖిల ఆకర్షణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'AP04 రామాపురం'. త్వరలోనే విడుదలకానున్న ఈ సినిమా నుంచి తాజాగా 'ఏటి చేయను' అంటూ సాగే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఎస్‌వి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం, విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగగా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామ్ జక్కల.. సినిమాలను ఆదరించాలని కోరారు.

కష్టాన్ని కూడా ఇష్టంగా భావించి ఈ సినిమా చేశామని పేర్కొన్న దర్శకుడు హేమ రెడ్డి.. మా చిత్ర బృందానికి అందరి సపోర్టు అవసరమని తెలిపారు. ఇక ఆర్‌ఆర్ క్రియేటివ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.వి శివారెడ్డి సమర్పణలో తెరకెక్కిన చిత్రాన్ని రామ్ రెడ్డి అందురి, డి. ఎల్లారెడ్డి నిర్మించారు.

Similar News