ప్రమోషన్స్ కి హ్యాండ్ ఇచ్చిన అనుష్క.. కష్టపడిపోతున్న Naveen Polishetty

ఓ సినిమాను తీయడం కంటే.. దాన్ని ప్రమోట్ చేయడం ఇంకా ఎక్కువ కష్టంగా ఉంటుంది.

Update: 2023-08-30 09:29 GMT

దిశ, సినిమా: ఓ సినిమాను తీయడం కంటే.. దాన్ని ప్రమోట్ చేయడం ఇంకా ఎక్కువ కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మూవీ హిట్ అవ్వడానికి ప్రమోషన్ చాలా ముఖ్యం. అందుకే ఎంత పెద్ద హీరో హీరోయిన్ అయిన కూడా వారి సినిమా ప్రమోషన్స్ లో భాగం కావాల్సిందే. కానీ ఈ మధ్య కొంతమంది హీరోయిన్లు మాత్రం నో ప్రమోషన్స్ అనే కొత్త స్టాండ్ తీసుకున్నారు. ఇందులో మొన్నటి వరకు సమంత ఉండగా.. ఇప్పుడు అనుష్క కూడా చేరింది. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అనుష్క .. ప్రమోషన్స్‌కు దూరం దూరంగా ఉంటుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్ బాధ్యతలు హీరో నవీన్ పొలిశెట్టి ఒక్కడే భుజాన వేసుకున్నాడు. సెప్టెంబర్ 7న రిలీజ్ కానున్న ఈ మూవీ కోసం నవీన్ పడుతున్న కష్టాన్ని చూసి మెచ్చుకుంటున్న నెటిజన్లు.. అనుష్క తీరును విమర్శిస్తున్నారు.

Tags:    

Similar News