మాస్ మహరాజ్ సరసన చాన్స్ కొట్టేసిన అనుపమ

కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ 'కార్తికేయ 2' మూవీ సక్సెస్‌ జోష్‌లో మునిగి తేలుతోంది.

Update: 2022-09-14 07:10 GMT

దిశ, సినిమా : కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ 'కార్తికేయ 2' మూవీ సక్సెస్‌ జోష్‌లో మునిగి తేలుతోంది. ఆగస్టు 13న వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ సినిమా మంచి కంటెంట్‌ అండ్ విజువల్స్‌తో ప్రేక్షకుల మనసులు దోచుకోగా.. బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది అనుపమ. ఇక లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. తనకు క్రేజీ ప్రాజెక్ట్‌లో చాన్స్ దక్కినట్లు టాక్ వినిపిస్తోంది. మాస్ మహరాజ్ రవితేజ ప్రధాన పాత్రలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‏తో పాన్ ఇండియా లెవెల్‌లో రూపొందుతున్న మూవీకి సంబంధించి ప్రీప్రొడక్షన్ పనులు ఇప్పటికే జరుగుతుండగా.. 'ఈగల్' టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో అనుపమను కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం. ఇదేగాక తను నిఖిల్ సరసన నటించిన '18 పేజెస్'తో పాటు 'బటర్ ఫ్లై' చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 

Also Read : పూజా హెగ్డేపై సాయి పల్లవి ఫ్యాన్స్ ట్రోలింగ్ 

Tags:    

Similar News