8 నెలల ప్రెగ్నెంట్‌గా ఉన్నా ఆ పని చేశానంటూ యాంకర్ శ్యామల కామెంట్స్.. డెలివరీ అయ్యాక అలా చేయడంతో

Update: 2024-05-01 04:03 GMT

దిశ, సినిమా: బుల్లితెర స్టార్ యాంకర్ శ్యామల పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లయ, అభిషేకం, గోరింటాకు వంటి వాటిలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత యాంకరింగ్ స్టార్ట్ చేసి పలు స్పెషల్ ప్రోగ్రామ్స్, సినిమా ఈవెంట్స్ చేసి ఫుల్ పాపులారిటీ సంపాదించి స్టార్ యాంకర్‌గా మారిపోయింది. అంతేకాకుండా పలు సినిమాల్లోనే క్యారెక్టర్‌గా ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించింది. అయితే శ్యామత గత కొద్ది కాలంగా సినిమాలు చేస్తూ యాంకరింగ్‌కు కాస్త దూరంగా ఉంటుంది. అలాగే ఎన్నికల ప్రచారం కూడా మొదలెట్టి బిజీ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో..

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్యామల ఆసక్తికర కామెంట్స్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ‘‘ నేను 19 ఏళ్లకే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మొదట మా ఇంట్లో వాళ్లు నా ప్రేమను ఒప్పుకోలేదు. నా పెళ్లికి కూడా రాలేదు. కానీ నాకు మా అమ్మను ఎలాగైనా ఒప్పించి పెళ్లి చూసేలా చేసుంటే బాగుండేది అని అనిపిస్తుంది. అయితే నేను 8 నెలల కడుపుతో ఉన్నప్పుడు కూడా యాంకరింగ్ చేశాను.

బాబు పుట్టిన తర్వాత మాత్రం కొద్ది రోజులు రెస్ట్ తీసుకున్నాను. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ ఆఫర్ రావడంతో 11 నెలల బాబును వదిలేసి వెళ్లాను. అది కూడా మా ఆయన చూసుకుంటాను నువ్వు మంచి ఆఫర్‌ను పోగొట్టుకోకనే చెప్పారు కాబట్టి వెళ్లాను. కానీ కొందరు డబ్బు కోసం బిడ్డను వదిలేసి వెళ్లానని నోటికి వచ్చినట్లు మాట్లాడి ట్రోల్ చేశారు. అయితే మా బాబు పుట్టిన తర్వాత మా రెండు ఫ్యామిలీస్ కలిశాయి. ప్రస్తుతం అందరం సంతోషంగా ఉన్నాము’’ అంటూ చెప్పుకొచ్చింది.


Similar News