పూలు అమ్ముకునే మహిళకు షాక్ ఇచ్చిన అమితాబ్.. ఒక్క బొకేకు ఎంత ఇచ్చాడంటే

రోడ్డుమీద పూలు అమ్ముకునే మహిళకు చేసిన ఆర్థిక సాయం గురించి అమితాబ్ బచ్చన్ ఆసక్తిర విషయం వెల్లడించాడు.

Update: 2023-06-28 08:18 GMT

దిశ, సినిమా: రోడ్డుమీద పూలు అమ్ముకునే మహిళకు చేసిన ఆర్థిక సాయం గురించి అమితాబ్ బచ్చన్ ఆసక్తిర విషయం వెల్లడించాడు. ఇటీవల ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద తనకు ఎదురైన సంఘటనను ఓ సమావేశంలో గుర్తు చేసుకుంటూ. ‘ఓ రోజు భారీ వర్షం కురుస్తోంది. అదే సమయంలో నేను పనిమీద కారులో బయటకు వెళ్లాను. చౌరస్తాలో ఉన్న సిగ్నల్‌ దగ్గర ఒకమ్మాయి ప్లాస్టిక్ కవర్ కప్పుకుని గులాబీ పూలు అమ్ముతోంది. నా దగ్గరకు రాగానే ఆ గులాబీల ధర అడగలేదు. వెంటనే నా దగ్గరున్న కొంత డబ్బు లెక్కించకుండానే ఆమెకు ఇచ్చాను. తర్వాత కూడా ‘ఎంత ఇచ్చాను’ అని ఆమెను అడగలేదు. అయినప్పటికీ ఆ మహిళా నేను సంతోషంగా ఇచ్చిన పైసలను సంకోచంగానే తీసుకుంది. భయంతోనే తన దగ్గరున్న బొకేని నాకు అందజేసింది’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే కష్టజీవులు శ్రమకు మించిన ఫలితం పెద్దగా ఆశించరనే విషయం తనను కట్టిపడేసిందంటూ తనదైన స్టైల్‌లో ఆమెను పొగిడేశాడు. 

Read More:   ‘దేవర’లో సాయి పల్లవి.. అతిధి పాత్రపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్ 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News