'Urvasivo Rakshasivo Movie' సక్సెస్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా Allu Arjun (అల్లు అర్జున్)
అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రూపొందిన సినిమా 'ఊర్వశివో రాక్షసివో'. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన..Latest Telugu News
దిశ, సినిమా: అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రూపొందిన సినిమా 'ఊర్వశివో రాక్షసివో'. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కథ మొదలైన దగ్గర నుంచి చివరి వరకు బోర్ కొట్టకుండా నడిచిన కథనం.. ఇంటర్వెల్ బ్యాంగ్‌కు ఒక రేంజ్‌లోకి వెళ్లింది. ఆ తర్వాత ఏ మాత్రం టెంపో తగ్గకుండా క్లైమాక్స్ దిశగా తీసుకెళ్లిన తీరు ఆడియన్స్‌ను మెప్పిస్తోంది.
ఇక రొమాంటిక్, ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి ఆదరణ లభిస్తుడడంతో రేపు సాయంత్రం అనగా నవంబర్ 6న హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో సక్సెస్ పార్టీ నిర్వహించనున్నారు. కాగా ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరు కానున్నట్లు మూవీ యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
ఇవి కూడా చదవండి :
చేతిలో బిడ్డతో దర్శనమిచ్చిన Rana Daggubati భార్య Miheeka Bajaj!