వార్ 2’.. తారక్‌కు జోడిగా అలియా భట్?

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధానపాత్రలు పోషిస్తున్న చిత్రం ‘వార్ 2’.

Update: 2023-04-12 08:17 GMT

దిశ, సినిమా: అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధానపాత్రలు పోషిస్తున్న చిత్రం ‘వార్ 2’. కాగా ఈ మూవీ నుంచి మరో బిగ్ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హృతిక్‌కి జోడీగా దీపికా పదుకొణె నటించనుండగా ఎన్టీఆర్ సరసన అలియా భట్ కనిపించబోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్‌, అలియా ఇద్దరూ కలిసి ‘ఎన్టీఆర్ 30’ చిత్రంలో కలిసి నటించాల్సి ఉండగా బిజీ షెడ్యూల్ కారణంగా అలియా తప్పుకుంది. ఇప్పుడు ‘వార్ 2’ కోసం ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.

ఇవి కూడా చదవండి: 

Hollywood : హాలీవుడ్ సినిమాకు జక్కన టెక్నికల్ సపోర్టు?

Tags:    

Similar News