సమంత ఆఫర్ కొట్టేసిన అలియా.. చివరి క్షణంలో ఆ హీరో అలా చేసినందుకేనా?

చిత్ర పరిశ్రమలో ఒకరి ఆఫర్స్ మరొకరు అందుకోవడం అనేది చాలా కామన్. కొంత మంది ఒక సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ చేసుకుంటారు. కానీ చివరి నిమిషంలో ఒక్కసారిగా హీరోయిన్‌ను మార్చేస్తారు.

Update: 2024-04-28 10:21 GMT

దిశ, సినిమా : చిత్ర పరిశ్రమలో ఒకరి ఆఫర్స్ మరొకరు అందుకోవడం అనేది చాలా కామన్. కొంత మంది ఒక సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ చేసుకుంటారు. కానీ చివరి నిమిషంలో ఒక్కసారిగా హీరోయిన్‌ను మార్చేస్తారు. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఆఫర్‌ను బాలీవుడ్ బ్యూటీ అలియా కొట్టేసిదంట. అయితే తాజాగా రణవీర్ సింగ్, అలియా మేక్ మై ట్రిప్ అనే యాడ్ ప్రమోషన్‌లో కనిపించిన విషయం తెలిసిందే. ఇందులో అలియా చాలా ఫన్నీగా నటించారు. అయితే ఈ యాడ్ కోసం ముందుగా మేకర్స్ సమంతను కలిశారంట. దీనికి సమంత కూడా ఒకే చెప్పినట్లు సమాచారం. కానీ చివరగా రణవీర్‌ సింగ్‌ను మేకర్స్ సమంత, అలియాలో ఒకరి చూస్ చేసుకోండి అని చెప్పగా, ఆయన టక్కున అలియా అని చెప్పారంట. దీంతో వారిద్దరు కలిసి యాడ్ చేశారు. దీంతో సమంత ఆఫర్‌ను అలియా కొట్టేసిందంటు, ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఈ మధ్యకాలంలో ఓ వార్త వైరల్ అయ్యింది. సమంత , రణవీర్ సింగ్ కలిసి ఓ యాడ్‌లో నటించిన విషయం తెలిసిందే. అప్పుడు సమంతను మేకర్స్ రామ్ చరణ్, రణవీర్ సింగ్‌లో మీరు ఎవరితో యాడ్ చేయాలనుకుంటున్నారు అని అడగ్గా ఆమె చరణ్‌ను కాదు అని రణవీర్ సింగ్‌ను ఓకే చేసింది. దీంతో ప్రస్తుతం చెర్రీ ఫ్యాన్స్ సమంతను ట్రోల్ చేస్తున్నారు. అప్పుడు తెలుగు హీరోను కాదు అని బాలీవుడ్ హీరోకు ఒకే చెప్పావు. కానీ ఆయన మాత్రం బాలీవుడ్ నటికే ఓటు వేశాడు..నీకు మంచిగ అయ్యింది సమంత అంటూ ఆమెపై ఫైర్ అవుతున్నారు.


Similar News