అకీరా సెటిల్ కావడానికి పవన్ కల్యాణ్ సపోర్ట్ అవసరం లేదు.. రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ విడాకుల తర్వాత సినిమాలకు దూరమై పిల్లలను చూసుకుంటూ ఉంటుంది.

Update: 2023-10-30 07:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ విడాకుల తర్వాత సినిమాలకు దూరమై పిల్లలను చూసుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తుంది. అయితే ఇటీవల ‘టైగర్ నాగేశ్వర రావు’ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటుంది. అలాగే పవన్ ఫ్యాన్స్ ఏమైనా అనేవారికి, ట్రోలర్స్‌కు తనదైన స్టైల్లో స్పందించి గట్టి వార్నింగ్ ఇస్తుంది. తాజాగా, రేణు మరోసారి నెటిజన్లపై ఫైర్ అయింది. ‘‘నేను ఏం మాట్లాడినా అమ్ముడు పోయాను అంటున్నారు. నేను ఎవరికి అమ్ముడు పోయానో ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో నాకు అర్థం కావడం లేదు. అయితే నేను అమ్ముడు పోయాను అన్నప్పుడు బాధపడలేదు. కానీ అకీరా విషయంలో అన్నప్పుడు నా మైండ్ పోయింది. అది ఏంటంటే.. నేను కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తుంది అకీరాను హీరోగా లాంచ్ చేయడం కోసం అట. వెధవల్లారా.. ఆయన అకీరా తండ్రి. అకీరాని లాంచ్ చేయడానికి అతని తండ్రినే నేను మెప్పించడానికి ట్రై చేస్తున్నా ఎలా అంటారు. అకిరా లైఫ్‌లో సెటిల్ కావడానికి నా అవసరం, పవన్ కల్యాణ్ గారి అవసరం కూడా లేదు. సొంతంగా సెటిల్ కాగలడు’’ అని చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News