Aishwarya Rai & Mahesh Babu :మహేష్ సినిమాలో నటించనున్న ఐశ్వర్యరాయ్

త్రివిక్రమ్ ఈ మూవీని ఓ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నాడు.

Update: 2023-01-30 05:58 GMT

దిశ, సినిమా: సూపర్‌ స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా‌ చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, త్రివిక్రమ్ ఈ మూవీని ఓ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నాడు. ఇకపోతే ఇందులో నటీనటులను చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటున్న త్రివిక్రమ్ తాజాగా ఓ కీలక పాత్ర పోషించేందుకు మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్‌ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆమె ఓ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుంది. ఇంకో విషయం ఏంటంటే మూవీ‌లో ఐశ్వర్యరాయ్- మహేష్ బాబు పాత్రల మధ్య డ్రామా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని టాక్. అయితే దీని గురించి పూర్తి వివరాలు, అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది.

READ MORE

ఘనంగా నటి పూర్ణ శ్రీమంతం వేడుక.. వీడియో, ఫోటోలు వైరల్ 

Tags:    

Similar News