Lavanya Tripati ను పెళ్లి చేసుకున్నాక నేనూ మారిపోతా.. కుండబద్దలు కొట్టిన Varun Tej

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘గాండీవధారి అర్జున’ చిత్రంలో నటిస్తున్నారు.

Update: 2023-08-23 08:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘గాండీవధారి అర్జున’ చిత్రంలో నటిస్తున్నారు. వరుణ్ తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వేడుకకు సుమ యాంకర్‌గా వ్యవహరించింది. ఆమె చేతిలో గన్ పట్టుకుని హల్చల్ చేస్తూ.. చిత్ర బృందాన్ని బుల్లెట్ లాంటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. కాగా సుమ.. పెళ్లయ్యాక రామ్ చరణ్, అల్లు అర్జున్‌లలో ఎవరు ఎక్కువగా ఛేంజ్ అయ్యారని అడగ్గా.. తేజ్‌కు ఏం చెప్పాలో అర్థం కాక తల పట్టుకుని..  ఈ క్వశ్చన్  వారినే అడగాలి అన్నాడు. అలాగే (నవ్వుతూ) ఎఫ్‌ 2 సినిమాలో మాకు అదే నేర్పించారు. పెళ్లి అయిన తర్వాత ఇక ఎవరైైనా మారిపోవాల్సిందే అన్నట్లుగా ఈ హీరో చెప్పుకొచ్చాడు. కాగా భార్యలు వచ్చాక బన్నీ, చరణ్‌ కూడా మారిపోయారంటూ చెప్పడంతో అక్కడున్న వారంతా నవ్వసాగారు. ప్రస్తుతం వరుణ్ కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇక ఎవరైనా మారిపోవాల్సిందే

ఇవి కూడా చదవండి : Niharika Konidela : మళ్లీ ప్రేమ పెళ్లి.. షాకింగ్ కండీషన్స్ పెట్టిన నాగబాబు?

Tags:    

Similar News