Actress Poonam Kaur : నటి పూనమ్ కౌర్‌కు అరుదైన వ్యాధి

నటి పూనమ్ కౌర్ 'ఫైబ్రోమైయాల్జియా' అనే ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది.

Update: 2022-12-01 12:02 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: నటి పూనమ్ కౌర్ 'ఫైబ్రోమైయాల్జియా' అనే ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. అలసట, నిద్ర, జ్ఞాపకశక్తి, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు.. తీవ్రమైన కండరాల నొప్పి ఈ వ్యాధి లక్షణాలుగా ఉంటాయని తెలిపింది. ప్రస్తుతం పూనమ్‌ కౌర్ కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారని సమాచారం. ఇక దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ఇదే తరహాలో మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సంగతి తెలిసిందే. సమంత ప్రస్తుతం ఈ వ్యధి నుండి కోలుకుంటుంది. పూనమ్ కౌర్ కూడా త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాంట్రవర్షియల్ కామెంట్స్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలిచే పూనమ్ కౌర్ ఈ రకంగా అనారోగ్యానికి గురైనట్లు వస్తున్న వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తు్న్నాయి.

READ MORE

ముంబాయి హోటల్లో సిద్ధార్థ్- హైదరి.. పిక్స్ వైరల్ 

Tags:    

Similar News