పెళ్లికి ముందే పిల్లలు వద్దని షరతు పెట్టా.. ప్రెగ్నెన్సీ వస్తే అలా చేసానంటూ నటి కవిత ఎమోషనల్ కామెంట్స్..

సీనియర్ నటి కవిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ ను మొదలుపెట్టిన కవిత సిరిసిరిమువ్వ సినిమాతో తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు.

Update: 2024-05-27 08:37 GMT

దిశ, సినిమా: సీనియర్ నటి కవిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ ను మొదలుపెట్టిన కవిత సిరిసిరిమువ్వ సినిమాతో తన ప్రయాణాన్ని మొదలు పెట్టారు. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో సైతం ఆమె నటించి మెప్పించారు. కాగా ప్రస్తుతం ఈమె పరిమితంగా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన షాకింగ్ విషయాలను వెల్లడించారు. అందులో భాగంగా భర్త దశరథ రాజ్ ఎదురు కట్నం ఇచ్చి మరీ నన్ను పెళ్లి చేసుకున్నారని.. నేను హీరోయిన్ గా రెండు నెలలు కష్టపడి సంపాదించే డబ్బును ఆయన ఒక్కరోజులో ఖర్చు చేసేవారు.. అలా అని నా డబ్బులు ఆయన అస్సలు ముట్టుకునేవారు కాదని కవిత చెప్పుకొచ్చారు.

అయితే నేను పెళ్లయిన తర్వాత పిల్లల్ని కననని కండీషన్ పెట్టి పెళ్లి చేసుకున్నానని కవిత వెల్లడించారు. కానీ పెళ్లి తర్వాత మా అత్తయ్య మాత్రం త్వరగా పిల్లలు కావాలని అడిగారని ఆమె పేర్కొన్నారు. తమ్ముడు చనిపోయాక వాడి జ్ఞాపకాలతోనే బ్రతికిన నాకు పిల్లలు వద్దని అమ్మతో చెప్పాను. తమ్ముడిని మర్చిపోలేక ఆ బాధలో ఉన్న నేను పిల్లలు పుడితే చనిపోతారు అదే పుట్టకపోతే చనిపోరు కదా అని అన్నానని ఆమె అన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకే నేను గర్భం దాల్చాను.

దీంతో తమ్ముడి ఫోటో చూసి రోజూ ఏడ్చేదాని నా బాధ చూసి భర్త వరల్డ్ టూర్ కు తీసుకెళ్లారు. కానీ పాప పుట్టిన తర్వాత లైఫ్ సంతోషంగా మారిందని కవిత పేర్కొన్నారు. నాకు ముగ్గురు సంతానం కాగా కరోనా సమయంలో భర్త, కొడుకు చనిపోయారని ఆమె ఆ విషయాల గురించి చెబుతూ నటి కవిత ఎమోషనల్ అయ్యింది.

Similar News